సతీష్ మర్డర్ కేసు : నేరాన్ని ఒప్పుకున్న హేమంత్!

  • Published By: madhu ,Published On : September 2, 2019 / 12:50 PM IST
సతీష్ మర్డర్ కేసు : నేరాన్ని ఒప్పుకున్న హేమంత్!

Updated On : May 28, 2020 / 3:44 PM IST

సతీశ్‌ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధిస్తున్నారు. విచారణలో నేరాన్ని హేమంత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. యువతితో వివాహేతర సంబంధం వద్దన్నందుకే సతీశ్‌ను హత్య చేసినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు సతీశ్, హేమంత్ మద్యం సేవిస్తుండగా యువతి ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బయటపెడతాడో అన్న అనుమానంతో సతీశ్‌ను హత్య చేశానని హేమంత్‌ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. 

ప్రియాంకను రాత్రి 8గంటల సమయంలో హాస్టల్ వద్ద డ్రాప్ చేశాడు హేమంత్. సతీశ్..హేమంత్ రూముకు వెళ్లాడు. ఆఫీసులో అమ్మాయితో వివాహేతర సంబంధ విషయాన్ని సతీశ్ ప్రస్తావించాడు. ఈ సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు. ఎప్పటికైనా ఈ విషయాన్ని బయటపెడుతాడని భావించిన హేమంత్..సతీశ్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. రాత్రి 9.30 – 10.00 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని సతీశ్ మెడను కోశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా నరకాలని నల్లకవర్లు తీసుకొచ్చాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయి మరుసటి రోజు తొటి స్నేహితులకు విషయాన్ని చెప్పాడు. లొంగిపోవాలని వారు సూచించినా..హేమంత్..బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. హత్యలో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. 

విదేశాల్లో ఎంఎస్ పూర్తిచేసిన సతీశ్‌… హైదరాబాద్‌లో ఐటీ విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలోఐటీ కన్సల్టెన్సీని ప్రారంభించి అందులో తన చిన్ననాటి స్నేహితుడు హేమంత్‌ను పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కోచింగ్ సెంటర్, కన్సల్టెన్సీ పనులతో బిజీ అయ్యారు. ఉన్నట్టుండి సతీశ్‌ కనిపించకపోవడం.. హేమంత్ నివాసంలో రక్తపు మడుగులో మృతదేహమై పడివుండటంతో పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. హేమంత్‌ పరారవడంతో అతడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. అయితే.. తాజాగా అతడిని గుల్బర్గా దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా.. హేమంత్ కూడా పట్టుబడటంతో అతడిని విచారించడం ద్వారా ఈ మర్డర్ మిస్టరీని విప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తమ అనుమానాలు నిజమేనా? హత్యలో ఎంతమంది ప్రమేయముంది? హత్య సమయంలో ప్రియాంక ఎక్కడుంది? హత్య తర్వాత సతీశ్‌ డెడ్‌బాడీని ఏం చేద్దామనుకున్నారు? అనే కోణాల్లో హేమంత్‌ను విచారించారు. హత్యకు సంబంధించి పోలీసులు మీడియాకు వివరాలు తెలిపే అవకాశం ఉంది. 
Read More : సతీష్ హత్య కేసు : వివాహేతర సంబంధం లేదు – ప్రశాంతి