School Girl Steals Gold : ఇంట్లోంచి 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించిన పదో తరగతి బాలిక
పదో తరగతి చదివే ఓ బాలిక తన ఇంట్లోంచి 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించింది. ఆ బంగారాన్ని తనకు సోషల్ మీడియాలో పరిచయం అయిన స్నేహితులకు ఇచ్చింది.

School Girl Steals 750 Grams Gold
School Girl Steals Gold : పదో తరగతి చదివే ఓ బాలిక తన ఇంట్లోంచి 750 గ్రాముల బంగారాన్ని దొంగిలించింది. ఆ బంగారాన్ని తనకు సోషల్ మీడియాలో పరిచయం అయిన స్నేహితులకు ఇచ్చింది. బంగారం చోరీ అయిన సంగతి గమనించిన బాలిక తల్లి పోలీసుకు ఫిర్యాదు చేసింది.
కేరళలోని తిరువవంతపురానిక చెందిన 15 ఏళ్ళబాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇటీవల శిబిన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తాను తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉన్నానని వీలైనంత వరకు సహాయం చేయాలని కోరాడు. అతని బాధలు విని కరిగిపోయిన బాలిక తన ఇంట్లోని 750 గ్రాముల బంగారం చోరీ చేసి తన స్నేహితుడికి ఇచ్చింది.
ఆ బంగారాన్ని అమ్మేసిన శిబిన్ కొంత డబ్బుతో ఇల్లు బాగు చేయించుకున్నాడు. మిగిలిన వాటిలో రూ. 10 లక్షల రూపాయలు దాచి పెట్టుకున్నాడు. అలాగే పాలక్కాడ్ కు చెందిన మరో స్నేహితుడికి కూడ 40 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొన్నాళ్లకు తన ఇంట్లోని బంగారం మాయం కావచం గమనించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికపై అనుమావం వచ్చి ప్రశ్నించగా ఆమె అసలు విషయం చెప్పింది. శిబిన్ కు 750 గ్రాముల బంగారం… పాలక్కాడ్ స్నేహితుడికి 40 గ్రాముల బంగారం ఇచ్చినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు శిబిన్ ను అతడి తల్లి షాజీని అరెస్ట్ చేశారు.
కాగా ఏడాది క్రితం బాలిక తనకు 270 గ్రాముల బంగారం మాత్రమే ఇచ్చిందని శిబిన్ తెలిపాడు. దీంతో బాలికను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పాలక్కాడ్ స్నేహితుడు తన ఎకౌంట్ బ్లాక్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.