Headmaster Bite Cheek : స్కూల్‌లో ఘోరం.. విద్యార్థిని బుగ్గ కొరికిన హెడ్‌మాస్టర్

స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు. టీచర్ అంటే దేవుడితో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అందుకే టీచర్ అన్నా ఉపాధ్య

Headmaster Bite Cheek : స్కూల్‌లో ఘోరం.. విద్యార్థిని బుగ్గ కొరికిన హెడ్‌మాస్టర్

Headmaster Bite Cheek

Updated On : September 19, 2021 / 5:18 PM IST

Headmaster Bite Cheek : స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు. టీచర్ అంటే దేవుడితో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అందుకే టీచర్ అన్నా ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. అయితే కొందరు టీచర్లు తప్పుదోవ పడుతున్నారు. తమ చేష్టలతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధించి దిగజారిపోతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థిని బుగ్గ కొరికాడు.

Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని చెంపను కొరికాడు. ఆ బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ హెడ్ మాస్టర్ ను స్కూల్ గదిలో బంధించారు. ఈ ఘటన బీహార్ లోని కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

హెడ్ మాస్టర్ ను గదిలో బంధించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో పాటు స్కూలు దగ్గరికి చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.. హెడ్ మాస్టర్ ను బయటకు లాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం నుంచి ప్రధానోపాధ్యాయుడిని కాపాడడం పోలీసులకు కష్టతరమైపోయింది. ఎలాగోలా వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఘటన జరిగినప్పుడు అసలేం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన బుర్ర పని చేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కాగా, హెడ్ మాస్టర్ ను చితకబాదిన వీడియోలు వైరల్ కావడంతో.. కటిహార్ ఏఎస్పీ రష్మి స్పందించారు. ఆ వీడియోలు ఇంకా తన దృష్టికి రాలేదని, ఒకవేళ అదే నిజమైతే దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.