చీటింగ్ కేసు : సీఐడీ కస్టడీకి షేక్ నౌహీరా
హీరా గోల్డు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిత్తూరు జైలులో ఉన్న షేక్ నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

హీరా గోల్డు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిత్తూరు జైలులో ఉన్న షేక్ నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
చిత్తూరు : హీరా గోల్డు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిత్తూరు జైలులో ఉన్న షేక్ నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతివ్వడంతో నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం చిత్తూరు సబ్ జైలులో ఉన్న నౌహీరానాను కొద్దిసేపటి క్రితం సీఐడీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నౌహీరాను మూడ్రోజులపాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ప్రత్యేక వాహనంలో భారీ భద్రత మధ్య తిరుపతికి తరలిస్తున్నారు. రెండు చోట్ల ఆమెను విచారించనున్నారు. అయితే తిరుపతిలోని సీఐడీ కార్యాలయంలో విచారిస్తారా.. తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా అనేది చూడాలి.
ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేశారని నౌహీరాపై ఆరోపణలు ఉన్నాయి. 15 పైగా కంపెనీలు ప్రారంభించి, హీరా గ్రూప్ పేరిట నగలు దుకాణం మొదలుకొని టెక్స్ టైల్స్, స్వీట్స్, నగలు, వాటర్ బాటిల్స్ తోసహా 15 పైగా వ్యాపారాలను నిర్వహిస్తూ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు కూడా ఆరోపలణలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన డబ్బులు కూడా హీరా గ్రూప్ కు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.