తమిళనాడులో కాల్పుల కలకలం

  • Published By: bheemraj ,Published On : November 16, 2020 / 03:34 PM IST
తమిళనాడులో కాల్పుల కలకలం

Updated On : November 16, 2020 / 3:45 PM IST

Shooting in Tamil Nadu : తమిళనాడులోని పళనిలో కాల్పులు కలకలం రేపాయి. ఇరు వర్గాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారి తీసింది. ఓ సినిమా థియేటర్ యజమాని తుపాకులతో తన ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పళని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. థియేటర్ యజమాని నటరాజును పోలీసులు అరెస్టు చేశారు.



నటరాజు, సుబ్రహ్మణ్యం.. పళనిస్వామి అనే రెండు పార్టీల మధ్య ఓ థియేటర్ యజమాని విషయంలో వివాదం నెలకొంది. చాలా కాలంగా వీరి మధ్య ఆ థియేటర్ కు సంబంధించిన భూ వివాదం నడుస్తోంది. ఇవాళ అందుకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. ఒక వర్గాన్ని నటరాజు పిలిచారు. పళనిస్వామి, సుబ్రహ్మణ్యం, మరో వ్యక్తి ముగ్గురు కూడా ఒక థియేటర్ సమీపంలోని యజమాని ఇంటి వద్దకు వచ్చారు.



ఒకవైపు వారు చర్చిస్తుండగా నటరాజు తన వద్ద ఉన్న తుపాకీ తీసుకొచ్చి రోడ్డు పక్కన మాట్లాడుతున్న ముగ్గురిపై కాల్పులు జరిపాడు. సుబ్రహ్మణ్యం పొత్తి కడుపులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది. అలాగే పళనిస్వామి కాలిపై ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఇద్దరు కూడా ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయారు.
https://10tv.in/tamilnadu-chennai-businessman-home-unknown-person-gun-shooting-three-died/



సుబ్రహ్మణ్యం పళనిస్వామిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న స్థానికులు కాల్పులకు పాల్పడిన నటరాజుపై రాళ్ల దాడికి యత్నించారు. అయినప్పటికీ ఆయన మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.