తల్లీకూతురిపై షాప్ యజమాని లైంగిక వేధింపులు…తల్లీ ఆత్మహత్య
షాపు యజమాని లైంగిక వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య పాల్పడింది.

షాపు యజమాని లైంగిక వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య పాల్పడింది.
హైదరాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. షాపు యజమాని లైంగిక వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య పాల్పడింది. ఈఘటన మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళితే.. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని మౌనిక బట్టల షాపింగ్ మాల్‌లో కన్యాకుమారి, భావన అనే తల్లీ, కూతురు పని చేస్తున్నారు. షాపు యజమాని వివేకానంద.. షాప్ లో పని చేస్తున్న తల్లీ, కూతురును లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేక తల్లి కన్యాకుమారి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు షాపు యజమానిని అరెస్ట్ చేశారు.
యజమాని లైంగికంగా వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు తల్లీ తన కూతురిని ఒప్పించే క్రమంలో విషయం ఆమె బంధువులకు తెలియడంతో కన్యాకుమారిని ఆమె బంధువులు మందలించారు. పేదరికం, షాపు యజమాని లైంగిక వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
విషయం తెలుసుకున్న భావన, కన్యాకుమారి బంధువులు అక్కడి చేరుకుని షాప్ యజమాని వివేకానందపై దాడికి యత్నించారు. షాపు యజమాని అరాచకాలపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. షాపును మూసివేయాలన్నారు.