దిశ బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, మొబైల్ : కీలక ఆధారాలు సేకరణ

దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 02:25 PM IST
దిశ బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, మొబైల్ : కీలక ఆధారాలు సేకరణ

Updated On : December 5, 2019 / 2:25 PM IST

దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్

దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. దిశ బ్లడ్ శాంపిల్స్, తల వెంట్రుకలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన లారీ కేబిన్ లోనూ కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తుండుపల్లి టోల్ గేట్ సమీపంలో దిశ మొబైల్ ను నిందితులు పాతిపెట్టినట్టు గుర్తించిన అధికారులు.. అక్కడికి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు.

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను పోలీసులు గురువారం(డిసెంబర్ 5,2019) కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైల్లోనే నలుగురినీ విచారించారు. ఈ క్రమంలో దిశ సెల్‌ఫోన్‌ కోసం ఇన్ని రోజుల పాటు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దిశ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి అర కిలోమీటరు దూరంలో సెల్‌ఫోన్‌ను నిందితులు భూమిలో పాతిపెట్టినట్లు గుర్తించారు. స్పాట్‌లో సెల్‌ఫోన్‌తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

దిశ హత్య కేసులో నిజాల నిగ్గు తేల్చేందుకు, కఠినశిక్ష పడేలా చేసేందుకు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా… దిశ బాడీని తరలించేందుకు నిందితులు ఉపయోగించిన లారీని అణువణువు తనిఖీ చేస్తున్నారు. లారీని రహస్య ప్రాంతానికి తరలించిన క్లూస్‌ టీమ్‌.. ఆధారాలను సేకరించే పనిలో పడింది.

దిశ హత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు స్పీడప్ చేశారు. ఇందుకోసం ఏడుగురు పోలీసులకు ఒక బృందం చొప్పున.. 7 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. కానిస్టేబుళ్ల నుంచి సీపీ వరకు మొత్తం 50మంది పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయనున్నారు. నెల రోజుల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించడంతో.. అన్నికోణాల్లో దర్యాప్తు జరిపేందుకు ఖాకీలు సిద్ధమయ్యారు. ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా విచారణ జరపబోతున్నారు. కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకు ఈ బృందాలు దర్యాప్తు జరపనున్నాయి.

డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో బృందం నిందితులను విచారిస్తుండగా, రెండో బృందం సాక్ష్యాలను సేకరిస్తోంది. మూడో టీమ్… ఫోరెన్సిక్ తోపాటు డీఎన్‌ఏ రిపోర్టులను పరిశీలిస్తోంది. ఇక లీగల్ ప్రొసీడింగ్స్‌పై నాలుగో బృందం, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ అనాలసిస్‌పై ఐదో బృందం పని చేస్తోంది. ఆరో బృందం… ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఏడో బృందం.. సీన్ టు సీన్ అనాలసిస్, సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నాయి.