Somu Veerraju : కావాలనే మాపై కేసు పెట్టారు, మా తండ్రికి సంబంధం లేదు-సోము వీర్రాజు కుమార్తె

తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే  తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె  ఆరోపించారు.

Somu Veerraju : కావాలనే మాపై కేసు పెట్టారు, మా తండ్రికి సంబంధం లేదు-సోము వీర్రాజు కుమార్తె

Kovvuru Dsp Srinath

Updated On : January 4, 2022 / 2:36 PM IST

Somu Veerraju : తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయటానికే  తమపై మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కుమార్తె  ఆరోపించారు. తన భర్త వ్యాపార అవసరాల కోసమే ఎస్‌బీఐ నుంచి లోన్ తీసుకున్నారని.. డబ్బు లావాదేవీలకు సంబంధించి నిన్న మధ్య వర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయని ఆమె తెలిపారు.

మా తండ్రికి లోను వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని… మా తండ్రి ఇంటికి, మాకు ఎటువంటి రాకపోకలు సంబంధాలు లేవని  ఆమె చెప్పారు. నా వివాహం తర్వాత మా తండ్రి ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదని.. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే నా భర్త గద్దె జయరామకృష్ణ ఆస్తి పత్రాలు ష్యూరిటీ పెట్టి లోను తీసుకున్నారని…ఆ డబ్బులకు సంబంధించి సోమవారం రాజమహేంద్రవరంలో మధ్య వర్తల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు.
Also Read : YS Jagan : ఏపీకి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేటాయించండి-కేంద్ర మంత్రిని కోరిన సీఎం జగన్
బ్యాంక్ లోను కట్టటంలో డిఫాల్ట్ కావటంతో బ్యాంకు వారు జయరామకృష్ణకు నోటీసులు ఇచ్చారని… అనంతరం జయరామకృష్ణ కొవ్వురు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. జయరామకృష్ణ ఫిర్యాదు మేరకు కవల వెంకట నరసింహం పై   564/2021  కేసు నమోదు చేశామని దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ చెప్పారు.