YS Jagan : ఏపీకి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేటాయించండి-కేంద్ర మంత్రిని కోరిన సీఎం జగన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసారు.

Ap Cm Ys Jagan Meet Dharmendra Pradhan
YS Jagan : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసారు. దాదాపు 45 నిముషాల పాటు సాగిన సమావేశంలో వారిరివురూ ఏపీలో నవోదయా పాఠశాలల ఏర్పాటు,కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్ లో నిధులు కేటాయింపు,నూతన విద్యావిధానం అమలు పై చర్చలు జరిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాడు-నేడు,విద్యాభివృద్ధికి చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి గురించి ఆయన కేంద్రమంత్రికి వివరించారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గోన్నారు.
Also Read : Chhattisgarh : పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో యువకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు