సినిమా టికెట్ కొనివ్వలేదని.. తండ్రిపై కిరోసిస్ పోసి నిప్పుంటించాడు!

అభిమాన హీరో సినిమా విడుదలయ్యదంటే చాలు.. అభిమానులకు ఇక పండుగ వాతావరణమే. తమిళనాడు చెందిన ఓ యువకుడు కూడా తన అభిమాన హీరో సినిమా చూడాలనుకున్నాడు.

  • Published By: sreehari ,Published On : January 11, 2019 / 08:48 AM IST
సినిమా టికెట్ కొనివ్వలేదని.. తండ్రిపై కిరోసిస్ పోసి నిప్పుంటించాడు!

Updated On : January 11, 2019 / 8:48 AM IST

అభిమాన హీరో సినిమా విడుదలయ్యదంటే చాలు.. అభిమానులకు ఇక పండుగ వాతావరణమే. తమిళనాడు చెందిన ఓ యువకుడు కూడా తన అభిమాన హీరో సినిమా చూడాలనుకున్నాడు.

వేలూరు: అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యేందంటే చాలు.. అభిమానుల హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ కు ముందే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ కిందామీద పడి ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఫస్ట్ టికెట్ కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులోనూ తమిళ యాక్టర్ అజిత్ సినిమా అంటే పండుగే మరి. గురువారం సిల్వర్ స్ర్కిన్ పై అజిత్ కొత్త సినిమా ‘విశ్వాసం’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తొలిరోజే హిట్ టాక్ అందుకుంది. ఇక అజిత్ అభిమానులు ఆగుతారా? ఎలాగైనా ఈ సినిమా చూడాల్సిందేనని పట్టుబడుతారు. అలాగే తమిళనాడు చెందిన ఓ యువకుడు కూడా అజిత్ సినిమా చూడాలనుకున్నాడు. అతడి పేరు కూడా అజిత్ కుమార్. అభిమాన హీరో పేరు పెట్టుకున్న అతడు కన్ స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటాడు. అజిత్ సినిమా చూడాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వెంటనే తండ్రికి వద్దకు వెళ్లాడు. 

తండ్రి రోజువారీ కూలీ. నాన్న.. అజిత్ సినిమా చూడాలి. డబ్బులు ఇవ్వు. ఫస్ట్ డే టికెట్ కొనాలి అన్నాడు. కానీ, తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, సినిమా లేదు. ఏం లేదు పనికి వెళ్లు అని మందలించాడు. అంతే.. కుర్రాడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కన్నతండ్రి అని గుర్తుకు రాలేదు. సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి తండ్రి పాండ్యన్ (45) ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. తరువాత ఓ షాపు బయట నిద్రపోతున్నాడు. సినిమా టికెట్ కు డబ్బు ఇవ్వలేదనే కోపంతో తండ్రి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే నిద్రిస్తున్న కూలీలు వెంటనే మంటలు ఆర్పి పాండ్యన్ ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాండ్యన్ నెమ్మదిగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజిత్ కుమార్ ను పట్టుకొని విచారిస్తున్నారు.