మంత్రి కొడాలి నాని, పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 08:31 AM IST
మంత్రి కొడాలి నాని, పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్

Updated On : February 12, 2020 / 8:31 AM IST

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ధర్నా కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరు కావడం లేదని మంత్రి కొడాలి నాని (ఏ4), పార్థసారథి(ఏ1)తోపాటు మరో 10 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కొడాలి నాని, పార్థసారథికి విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేశారు. 

2015 జూన్ 25న సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద అనధికారికంగా నాని, పార్థసారథి, మరో 18 మంది ధర్నా చేయడంతో సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని జడ్డీ ఆదేశించారు. గైర్హాజరవ్వడంతో వారితోపాటు మరో 10 మందికి జడ్జి నాన్ బెయిలబుల్ వారెంట్ చేశారు.