బంజారాహిల్స్ లో కారు బీభత్సం : భయంతో పరుగులు తీసి జనం

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 04:13 AM IST
బంజారాహిల్స్ లో కారు బీభత్సం : భయంతో పరుగులు తీసి జనం

Updated On : December 26, 2019 / 4:13 AM IST

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే పని చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. వారు అత్తాపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదానికి కారణమైన కారు ఎవరిది? అందులో ఉన్న యువకులు ఎవరు? కారుని ఎవరు డ్రైవ్ చేశారు? అసలు ప్రమాదానికి కారణం ఏంటి? మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారా? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఫైన్లు వేసి జైలుకి పంపుతున్నా.. తాగుబోతులు మారడం లేదు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా భయపడటం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అమాయకులను బలి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తాగి డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు ఎంత చెప్పినా కొందరు మందుబాబులు వినిపించుకోవడం లేదు.