ఏ యాప్ పనిచేయదు : దేశంలో సోషల్ మీడియా బ్యాన్!

కొలంబో : శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్ సహా ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు.

  • Published By: sreehari ,Published On : May 13, 2019 / 12:42 PM IST
ఏ యాప్ పనిచేయదు : దేశంలో సోషల్ మీడియా బ్యాన్!

Updated On : May 13, 2019 / 12:42 PM IST

కొలంబో : శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్ సహా ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు.

శ్రీలంకలో సోషల్ మీడియా మూగబోయింది. సోషల్ మెసేజింగ్ యాప్స్.. ఫేస్ బుక్, వాట్సాప్ అన్ని ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. ఇటీవల లంకలో ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లంకలోని ముస్లిం సొంత వ్యాపారాల పరిస్థితి దారుణంగా మారింది.

బాంబు పేలుళ్ల అనంతరం క్రిస్టయన్ మెజార్టీ టౌన్ చిలౌ టౌన్ లో ఆదివారం (మే 12, 2019) డజన్ల మందికి పైగా జనం.. మసీదులు, ముస్లిం బిజినెస్ స్టోర్లపై రాళ్లతో దాడి చేశారు. ఫేస్ బుక్ వేదికగా చెలరేగిన వివాదం కారణంగా ముస్లిం స్టోర్లపై రాళ్ల దాడికి దారితీసింది. ఫేస్ బుక్ లో వివాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ హమ్మీద్ మహ్మద్ హస్మర్ (38) అనే వ్యక్తిగా గుర్తించారు. 

లంక బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఫేస్ బుక్ లో పెట్టిన వివాదాస్పద కామెంటుతో అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా.. వారి స్టోర్లపై రాళ్లతో దాడి చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.  

సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపించడంతో ఇలాంటి విధ్వంసక ఘటనలు జరుగుతున్నాయని, శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను తాత్కాలికంగా బ్యాన్ చేసింది. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు సోషల్ మీడియాను బ్లాక్ చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మొబైల్ యాప్స్ వైబర్, ఐఎంఓ, స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ సర్వీసులను నిలిపివేశారు.