Hyderabad : హైదరాబాద్ లో దారుణం : కుక్కనోట్లో బాలుడి తల

హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్ధలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad : హైదరాబాద్ లో దారుణం : కుక్కనోట్లో బాలుడి తల

Hyderbad Stray dog

Updated On : March 14, 2022 / 11:54 AM IST

Hyderabad : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం చోటు చేసుకుంది. మృత శిశువు తలను వీధికుక్క పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్ధలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఆదివారం ఉదయం మన్సూరా బాద్ లోని సహారా ఎస్టేట్ మొదటిగేటు సమీపంలో ఒక మృత శిశువు తల పట్టుకుని వీధి కుక్క వెళుతోంది. అది చూసిన స్ధానికులు విస్మయానికి గురయ్యారు. దాన్ని ఫాలో అవ్వగా అది ఆ తలను ముళ్ల పొదల మధ్యలో పడేసి వెళ్లి పోయింది.

Also Read : Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త
స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు చిన్నారి తలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొండెం కోసం గాలింపు చేపట్టారు.డాగ్స్ టీం క్లూస్ టీం పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Also Read : Pawan Kalyan : పవర్ కోసం పవన్ యుధ్ధం

బాలుడి తలను కుక్క ఎక్కడ్నుంచి తెచ్చింది, అది ఎవరి తల అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడ్ని ఎవరైనా హత్యచేశారా, నరబలి ఇచ్చారా… లేక మృత శిశువు తల కుక్క కొరికి తీసుకువచ్చిందా అనే విభిన్న కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.