హద్దులు దాటిన మూఢనమ్మకం : పసికందుకు వాతలు

బొడ్డూడని పసికందులతో పాటు పిల్లలకు ఎలాంటి రోగాలు సోకినా వారికి చెడు జరుగకూడదంటూ శరీరంపై వాతలు పెట్టే దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. 

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 04:30 AM IST
హద్దులు దాటిన మూఢనమ్మకం : పసికందుకు వాతలు

Updated On : February 6, 2019 / 4:30 AM IST

బొడ్డూడని పసికందులతో పాటు పిల్లలకు ఎలాంటి రోగాలు సోకినా వారికి చెడు జరుగకూడదంటూ శరీరంపై వాతలు పెట్టే దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. 

విజయనగరం : అత్యాధునికయుంగంలో ఉన్నాం.. టెక్నాలజీలో, వైద్యరంగంలో దూసుకెళ్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాం.. అయినా నేటి సమాజంలో కొందరు మూఢవిశ్వాసాల్ని వీడటం లేదు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత ప్రజల్లో కొందరు మూఢనమ్మకాలు పాటిస్తున్నారు. బొడ్డూడని పసికందులతో పాటు పిల్లలకు ఎలాంటి రోగాలు సోకినా వారికి చెడు జరుగకూడదంటూ శరీరంపై వాతలు పెట్టే దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది.

 

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఊబగుడ్డి గ్రామానికి చెందిన పాడి నర్శమ్మ గర్భిణి. నెలలు నిండటంతో సాలూరులోని గర్భిణుల వసతిగృహంలో ఉంచి ప్రసవం చేశారు. ఆపై స్వగ్రామానికి పంపించారు. శిశువు పుట్టిన ఐదో రోజునే కడుపు, చేతులపైన కుటుంబ సభ్యులు సూది కాల్చి వాతలు పెట్టారు. రెండురోజుల తర్వాత కూడా గాయాలు తగ్గకపోవడంతో ఫిభ్రవరి 5 మంగళవారం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఫిభ్రవరి 5 మంగళవారానికి శిశువు వయసు 11 రోజులకు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఎస్‌ఎంసీయూ యూనిట్‌లో శిశువుకు డాక్టర్లు సేవలందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితి లేదని, చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఊబగుడ్డిలో పిల్లలు పుడితే వాతలు పెట్టడం ఆచారమని, అందుకే తామూ అలాగే చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.