T Series MD Bhushan Kumar : టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్ మూడేళ్ల పాటు అత్యాచారం చేశారు
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

T Series Head Bhushan Kumar Rape Case
T Series MD Bhushan Kumar : ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 2017లో తన అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ళపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
మూడేళ్లలో భూషణ్ తనపై అత్యాచారం చేసిన ప్రదేశాలను బాధితురాలు తన ఫిర్యాదులో వివరించింది. మూడేళ్లవుతున్నా తనకు అవకాశం ఇవ్వలేదని అడిగితే తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది . బాధితురాలి ఫిర్యాదు మేరకు భూషణ్ కుమార్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. భూషణ్ కుమార్ ను పోలీసులువిచారించాల్సి ఉంది.
1997 లో తన తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. 2001 లో తుమ్ బిన్ తో చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టి పలు విజయవంతైన చిత్రాలు నిర్మించాడు. భూషణ్ కుమార్ 2005 పిబ్రవరి 13న నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికిరూహన్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు.
2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మోడల్ కూడా భూషణ్ కుమార్ పై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. తన ఇమేజ్ దెబ్బతీయాడానికే ఇలా చేస్తోందని అప్పట్లో భూషణ్ ఆమె వ్యాఖ్యలను ఖండించాడు.