Love Couple : పెద్దలు ప్రేమ పెళ్లి అంగీకరించ లేదని  ప్రేమికులు ఆత్మహత్యయత్నం

ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని తమిళనాడులోని తూత్తుకుడిలో ఓజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియురాలు కన్నుమూయగా ప్రియుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.

Love Couple : పెద్దలు ప్రేమ పెళ్లి అంగీకరించ లేదని  ప్రేమికులు ఆత్మహత్యయత్నం

Love Couple Commits Suicide Attempt

Updated On : April 30, 2021 / 5:21 PM IST

Love Couple :  ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని తమిళనాడులోని తూత్తుకుడిలో ఓజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియురాలు కన్నుమూయగా ప్రియుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.

తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి పుదుగ్రామం ఆరో వీధికి చెందిన ముత్తుపాండి కుమారుడు పాండిదురై (22) అదే ప్ర్రాంతానికి చెందిన 17 సంవత్సరాల విద్యార్ధినితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని ఇళ్లలో చెప్పారు. ఇంట్లో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు.

జీవితంలో కలిసి జీవించలేమని భావించిన  ప్రేమజంట బుధవారం వేలాయుధపురం రైల్వే స్టేషన్ సమీపంలో కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని తాగారు. స్పృహతప్పి కింద పడిపోయిన  ఇద్దరినీ స్ధానికులు గుర్తించి తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడ పాండిదురై చికిత్స పొందుతుండగా… విద్యార్ధిని చికిత్స పొందతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read>>>Gold Robbery Case: తెలంగాణ పోలీస్.. ఏపీ పోలీస్.. మధ్యలో ఓ దొంగ!