Gold Robbery Case: తెలంగాణ పోలీస్.. ఏపీ పోలీస్.. మధ్యలో ఓ దొంగ!

పోలీస్ ఎక్కడైనా పోలీసే. రాష్ట్రం మారినంత మాత్రాన పోలీస్ పోలీస్ కాకుండా పోతాడా అనుకోని పక్క రాష్ట్రంలోకి వెళ్లి దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా. మరి ఆ పోలీసుల అనుమతి కూడా కావాల్సిందే.

Gold Robbery Case: తెలంగాణ పోలీస్.. ఏపీ పోలీస్.. మధ్యలో ఓ దొంగ!

Gold Robbery Case

Gold Robbery Case: పోలీస్ ఎక్కడైనా పోలీసే. రాష్ట్రం మారినంత మాత్రాన పోలీస్ పోలీస్ కాకుండా పోతాడా అనుకోని పక్క రాష్ట్రంలోకి వెళ్లి దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా. మరి ఆ పోలీసుల అనుమతి కూడా కావాల్సిందే. ఇక్కడే వచ్చి పడింది పెద్ద చిక్కు. ఈ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్యలో ఓ దొంగ లేదు సార్ నేను నిజమే చెప్తున్నా అంటున్నా.. ఆ పోలీసులు కాదు ఆ దొంగ చెప్తుంది అబద్దమే అంటున్నారు. అసలు ఈ దొంగా పోలీస్ కథేంటో వివరాలలోకి వెళ్లి చూద్దాం.

తెలంగాణ పోలీసులు వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగిన ఓ బంగారం చోరీకేసులో ఓ దొంగను అరెస్టు చేశారు. ఆ దొంగది ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామం. పెబ్బేరులో చోరీ చేసిన బంగారాన్ని ఎక్కడ అమ్మావో చెప్పాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఆత్మకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో అమ్మేశానని చెప్పాడు. దీంతో పెబ్బేరు పోలీసులు ఆ బంగారాన్ని రికవరీ చేద్దామని ఆత్మకూరు వెళ్లారు. అక్కడ ఆ దొంగ చెప్పిన దుకాణాల యజమానులును బంగారం గురించి విచారణ చేశారు.

కానీ, ఆ దుకాణం యజమాని అసలు ఆ వ్యక్తే తన దగ్గరకు రాలేదని.. ఇంక బంగారం అమ్మింది ఎక్కడని ఖరాఖండీగా చెప్పాడు. కానీ పోలీసులు ఈ దొంగ నీ పేరు చెప్తున్నాడని గట్టిగా వాదించారు. దీంతో ఆ దుకాణం యజమాని మిగతా దుకాణాల వారిని కూడా వెంటపెట్టుకొని మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రశీదును కూడా కలుపుకొని స్థానిక ఆత్మకూరు పోలీసులను సంప్రదించారు. ఎవడో దొంగ నోటికి వచ్చింది చెప్తే దానిద్వారా పెబ్బేరు పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పోలీసులతో చెప్పుకున్నారు. దీంతో ఆ పోలీసులు కూడా ఈ కేసులో రంగంలోకి దిగారు.

ఈ చోరీ కేసులో దొంగను విచారించిన ఏపీ పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఆ దొంగ లేదు సార్ పెబ్బేరు పోలీసులే బలవంతంగా ఏదో ఒక దుకాణం పేరు చెప్పమన్నారని ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తంగా ఇరు రాష్ట్రాల పోలీసుల ఎదుట.. దొంగ నోటికి వచ్చింది చెప్తే మీరు మమ్మల్ని తప్పుబడతారా.. అలాంటి బంగారాన్ని ఆత్మకూరులోనే ఎవరు కొనుగోలు చేయరని బంగారం దుకాణాల యాజమానులంతా ఉమ్మడిగా ఒకటేమాట చెప్పారు. దీనికి ఏపీ పోలీసులు కూడా ఔను నిజమే మీరు దొంగతో అలా చెప్పించారంట కదా అని పెబ్బేరు పోలీసులను ప్రశ్నించారు.

మొత్తంగా అలా బంగారం రికవరీకి వెళ్లిన పెబ్బేరు పోలీసులు వెనిదిరిగి వచ్చేశారు. బస్టాండ్ సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ నుంచి బంగారం తీసుకెళ్లిన దొంగను గుర్తించి రికవరీకి వెళ్లామని.. కానీ అక్కడి నాయకులు దొంగను వెనకేసుకొచ్చి తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దొంగిలించిన దొంగ ఆత్మకూరులో బంగారం విక్రయించినట్లు చెప్తున్నా.. ఆత్మకూరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళతో తమకు సహకరించడం లేదని పెబ్బేరు ఎస్సై చెప్తున్నారు. ఈ చోరీకేసులో పరిశోధన ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు చేపడతామని.. అక్కడి ఉన్నతాధికారుల ద్వారా బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని చెప్తున్నారు.

Read: Drugs Smuggling: కడుపులో 2.22 కేజీల డ్రగ్స్.. ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిన దొంగలు!