టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని కొట్టి చంపాడు

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 04:01 AM IST
టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని కొట్టి చంపాడు

Updated On : February 21, 2020 / 4:01 AM IST

చిన్న విషయం  చిలికి చిలికి గాలివానలా మారి ఒక వ్యక్తినిండు ప్రాణం తీసింది.  టీవీ సౌండ్‌ విషయంలో ఓ వ్యక్తి చేసిన దాడిలో సాత్‌పుతే గిర్మాజీ రాజేందర్‌(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలోని  రాజేందర్‌ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో ఇంట్లో టీవి చూస్తున్నాడు

అతని ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి అదే సమయంలో భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో కోపంతో ఉన్న బాలనర్సయ్య తన ఇంటి యజమాని రాజేందర్‌ను టీవీ సౌండ్‌ ఎందుకు ఎక్కువ పెట్టావని తలపై బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్‌ అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు.

దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా రాజేందర్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు.  పోలీసులు  సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.