గాయపడిన వారికి వైద్యసాయం : హోంమంత్రి

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫైర్ సిబ్బంది త్వరగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. గాయపడిన వారికి వైద్యసాయం అందిస్తామని ప్రకటించారు.