తెలంగాణ వీరప్పన్ దొరికాడు
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, మంథని పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇతను పట్టుబడ్డాడు. ఇతనితో పాటు మరో నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి 10 టేకు దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యానారాయణ మీడియాకు వెల్లడించారు.
మంథని మండలానికి చెందిన ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను 199లో ఫెర్టిలైజర్ వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీనితో కలప వైపు చూపు పడింది. అక్రమ మార్గంలో కలపను వివిధ రాష్ట్రాలకు తరలించేవాడు. 2009లో మొదలు పెట్టిన ఈ అక్రమ వ్యాపారాన్ని క్రమక్రమంగా విస్తరింపచేశాడు. సమీప ప్రాంతాల ప్రజలను మచ్చిక చేసుకున్న ఇతను ఓ మాఫియాను తయారు చేశాడు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఇతని నెట్ వర్క్ ఉంది.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్
మూడు గ్రూపులుగా ఇతను విభజించే వాడు. 20- 30 మంది గ్రూపులో ఉంటారు. ఒక గ్రూపులో ఉన్న వారు ప్రజలను మచ్చిక చేసుకుని కలప టేకులను నరికేవారు. మరొక గ్రూపులో ఉన్న వ్యక్తులు కలపను ఎవరికీ తెలియకుండా సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించే వారు. ఇంకొక గ్రూపులోని సభ్యులు అధికారుల నుండి తప్పించుకొనే విధంగా వివిధ రాష్ట్రాలకు కలప దుంగలను తరలించేవారు. నదుల ద్వారా అక్రమంగా తరలించేవారు. ఇతనికి రాజకీయ నేతలు, పోలీసులు, ఇతరులు సహకరించేవారని తెలుస్తోంది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఇతను దొరికాడు. వారి వద్ద 10 టేకు దుంగలు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి మరో 18 మంది సహకరిస్తున్నట్లు గుర్తించినట్లు రామగుండం సీపీ తెలిపారు. నిందితులపై త్వరలోనే పీడీ యాక్టు నమోదు చేస్తామని, ఎడ్ల శ్రీనుపై వివిధ స్టేషన్లలో 11 కేసులన్నట్లు వెల్లడించారు.
Read Also : కృష్ణా జిల్లాలో కలకలం : లారీలో రూ.1.90 కోట్లు స్వాధీనం