తెలుగు సినిమా హీరో అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : December 15, 2019 / 03:12 PM IST
తెలుగు సినిమా హీరో అరెస్టు

Updated On : December 15, 2019 / 3:12 PM IST

“ఎవడ్రా  హీరో”  అనే సినిమా హీరో బషీద్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రుణాలు ఇప్పిస్తానని పలువురి వద్ద  డబ్బు వసూలు చేసి బషీద్ మోసాలకు పాల్పడ్డాడు.  ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లోని ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో బషీద్‌ నకిలీ వ్యాపారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్‌ ఎంబసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బషీద్‌పై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

గుంటూరు జిల్లా కు చెందిన బషీద్ (42) సినిమాల మీద మోజుతో చదువు మధ్యలో ఆపేసాడు. హైదరాబాద్ చేరుకుని  సినీ రంగానికి చెందిన పలువిభాగాల్లో శిక్షణ పొందాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. . అల్లరే అల్లరి, మెంటల్‌పోలీస్‌, నోటుకు పోటు సినిమాలు నిర్మించాడు.

గతంలో హీరో సందీప్‌ కిషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. సందీప్‌ కిషన్‌తో సినిమా తీయడం కంటే కుక్కను పెట్టి సినిమా నిర్మిస్తానని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తరచూ వివాదాల్లో నిలిచే బషీద్‌ అనేక మందిని మోసం చేసి అరెస్ట్‌ కావడం టాలీవుడ్‌లో సంచలనం కలిగిస్తోంది.