ప్యారిస్‌లో ఘోరం : పసిబిడ్డ సహా 10మంది సజీవదహనం

ప్యారిస్‌ లోని అపార్ట్ మెంట్ లో మహిళ నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి పసిబిడ్డ సహా పదిమంది సజీవ దహనమయ్యారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 07:05 AM IST
ప్యారిస్‌లో ఘోరం : పసిబిడ్డ సహా 10మంది సజీవదహనం

Updated On : February 6, 2019 / 7:05 AM IST

ప్యారిస్‌ లోని అపార్ట్ మెంట్ లో మహిళ నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి పసిబిడ్డ సహా పదిమంది సజీవ దహనమయ్యారు.

ఫ్రాన్స్‌ : ప్యారిస్‌ ఘోరం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఇరుగు పొరుగు వారి మధ్య తలెత్తిన తగాదా అగ్గి రాజేసింది. పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. అపార్ట్ మెంట్ లో రాత్రివేళ ఓ మహిళ నిప్పు పెట్టడంతో  భవనంలో మంటలు చెలరేగి పసిబిడ్డ సహా పదిమంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఫైర్ సిబ్బంది సహా మరో 30 మందికి పైగా గాయపడ్డారు.

 

ప్యారిస్‌లోని ప్రిన్సెస్‌ సాకర్‌ స్టేడియంకు సమీపంలో సంపన్నులు నివసించే రూ ఎర్లాంజర్‌ స్ట్రీట్‌లో ఇరుగు పొరుగు వారి మధ్య తగాదా తలెత్తింది. ఈనేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపార్ట్ మెంట్ లో రాత్రివేళ ఓ మహిళ నిప్పు పెట్టింది. 8 అంతస్తుల భవనం పై బ్లాక్‌లలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. అపార్ట్ మెంట్ లోని వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు. కొందరు బాల్కనీల నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. పసిబిడ్డ సహా పదిమంది సజీవదహనమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న 250 మంది అగ్నిమాపక సిబ్బంది 5 గంటలపాటు తీవ్రంగా శ్రమించి, ఫిభ్రవరి 5 మంగళవారం రోజున ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అదే అపార్టుమెంట్‌కు చెందిన ఓ మహిళ(40)ను అరెస్టు చేశారు.