Wife Black Magic On Husband : తనపై భార్య చేతబడి చేయిస్తోందని కోర్టును ఆశ్రయించిన భర్త

తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.

Wife Black Magic On Husband : తనపై భార్య చేతబడి చేయిస్తోందని కోర్టును ఆశ్రయించిన భర్త

Wife Black Magic On Husband

Updated On : August 24, 2022 / 7:26 PM IST

Wife Black Magic On Husband : తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు.

ఇంటి కప్‌బోర్డులో నిమ్మకాయలు, కుంకుమ, మిరపకాయలు చాలాసార్లు కనిపించాయని బాధితుడు తెలిపాడు. అలాగే భార్య తనకు రెండు, మూడు సార్లు బూడిద కలిపిన భోజనం పెట్టిందని చెప్పాడు. ఈ విషయమై అత్తామామలను, భార్యను నిలదీసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నాడు. దాంతో భార్య మొబైల్‌లో కాల్ రికార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేశానని, దానిలో రికార్డైన మాటలతో విషయం బయటపడిందని పేర్కొన్నాడు.

Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య

కోర్టులో ఈ సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టిన బాధితుడు.. సెక్షన్ 156(3) కింద మరింత దర్యాప్తు చేయించాలని కోరాడు. ఈ కేసును స్వీకరించిన కోర్టు.. సదరు సెక్షన్ కింద కాకుండా, సెక్షన్ 200 కింద పిటిషన్‌ను గుర్తించింది. బాధితుడి భార్య, అత్తామామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.