Teacher Drinking Beer In Classroom : యూపీ స్కూల్‌లో దారుణం.. క్లాస్ రూమ్ లో బీరు తాగుతూ పాఠాలు చెప్పిన టీచర్‌

ఉత్తరప్రదేశ్‌ స్కూల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్‌ క్లాస్‌ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు.

Teacher Drinking Beer In Classroom : యూపీ స్కూల్‌లో దారుణం.. క్లాస్ రూమ్ లో బీరు తాగుతూ పాఠాలు చెప్పిన టీచర్‌

teacher drinking beer in classroom

Updated On : October 2, 2022 / 8:08 PM IST

Teacher Drinking Beer In Classroom : ఉత్తరప్రదేశ్‌ స్కూల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ టీచర్‌ క్లాస్‌ రూమ్ లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన హత్రాస్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు తన వెంట బీరు క్యాన్లు తెచ్చుకున్నాడు. తరగతి గదిలో బీరు సేవించి విద్యార్థులకు పాఠాలు చెప్పసాగాడు. అతడి పక్కన కుర్చీలో కూర్చొన్న ఒక మహిళా టీచర్‌ కూడా విద్యార్థులకు పాఠాలు చెబుతోంది.

విషయం తెలుసుకున్న స్థానికులు టీచర్‌ వద్దకు వెళ్లారు. స్టూల్‌ కింద ఖాళీ చేసిన ఒక బీరు క్యాన్‌ కనిపించింది. ఆ ఉపాధ్యాయుడి వద్ద ఓపెన్‌ చేయని మరో బీర్‌ క్యాన్ కూడా ఉంది. దానిని తన వెనుక దాచేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో క్లాసులో విద్యార్థుల ముందు బీరు తాగుతున్న టీచర్‌ను స్థానికులు నిలదీశారు.

Chhattisgarh : మద్యం తాగి స్కూలు వచ్చిన మహిళా టీచర్

మరోవైపు క్లాసులో బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఆ టీచర్‌ను సస్పెండ్‌ చేసినట్లు హత్రాస్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అయ్యింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో ఆదివారం షేర్‌ చేశారు.

విపరీతంగా తాగిన ఆ టీచర్ అమ్మాయిలకు పాఠాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వారు ఇలా ప్రవర్తిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అని ప్రశ్నించారు. టీచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను ఆమె కోరారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.