Andhra Pradesh : దొంగతనానికి వచ్చిన దొంగ మృతి

దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.

Andhra Pradesh : దొంగతనానికి వచ్చిన దొంగ మృతి

Nellore thief died

Updated On : May 17, 2022 / 2:47 PM IST

Andhra Pradesh : దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు తిలక్ నగర్ లో ఈరోజు తెల్లవారుజామున దొంగ ఇంట్లోకి ప్రవేశించటంతో ఇంటి యజమానులకు మెలుకువ వచ్చి అడ్డుకున్నారు.

దొంగ తన వద్ద ఉన్న ఆయుధాలతో ప్రతిఘటించడంతో ఇంటి యజమానులు ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. భయాందోళనకు గురైన వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని దొంగను  పట్టుకున్నారు.  అంతా కలిసి దొంగను కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్ధానికుల దాడిలో గాయపడిన దొంగను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దొంగ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దొంగ హిందీ భాషలో మాట్లాడుతుండటంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read : Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం