IIT Kharagpur Student : హాస్టల్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ థర్డ్ ఇయర్ విద్యార్థి అనుమానాస్పద మృతి..!

IIT Kharagpur Student : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఈ రోజు ఉదయం ఇన్‌స్టిట్యూట్‌లోని ఆజాద్ హాల్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని ప్రభుత్వ అధికారి కుమారుడు 21 ఏళ్ల షాన్ మల్లిక్‌గా గుర్తించారు.
Read Also : Maha Kumbh Mela 2025 : ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాకు సర్వం సిద్ధం.. 45కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం..!
తల్లిదండ్రులు అతన్ని కలవడానికి వచ్చారు. కానీ అతడు ఉంటే గది తలుపు మూసేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తలుపు తీయలేదు. దాంతో వారు బలవంతంగా తలుపులు తెరిచి చేశారు. అప్పటికే ఐఐటీ విద్యార్థి ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఐఐటీ విద్యార్థి మృతిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మృతికి ముందు రోజు రాత్రి ఎవరితో మాట్లాడాడు.. చివరగా ఏం తిన్నాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్, హాస్టల్‌లో స్నిఫర్ డాగ్‌లు సోదాలు నిర్వహిస్తున్నాయి. మునపటి రోజు సాయంత్రం అతడిని ఎవరెవరు కలిశారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
రెండు రోజుల క్రితం, క్యాంపస్‌లోని క్వార్టర్స్ నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ ఉద్యోగి (జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ఖరగ్‌పూర్ టౌన్ పోలీస్ స్టేషన్ జనవరి 10న స్వాధీనం చేసుకుంది. మృతుడి పేరు సాకిర్ అలీ మొల్లా. 30 ఏళ్ల విద్యార్థి కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ ప్రాంతానికి చెందినవాడు. ఉద్యోగం కారణంగా ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో నివసించేవాడు.
ఐఐటీ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మేదినీపూర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న సకీర్ అలీ తల్లి సకీలా బీబీ, సోదరి ఫాతిమా బీబీ, అత్త షాజుల్ అలీ మొల్లా, ఇతర బంధువులు కోల్‌కతా నుంచి వచ్చారు.
Read Also : Tap Water Dementia : కుళాయి నీరు తాగడం వల్ల డిమెన్షియా వస్తుందా? యూకేలో 27 మిలియన్ల పౌరులకు ముప్పు ఉందా?