Warangal Electric Shock : మోత్య తండాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
Warangal Electric Shock : వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

three died due to electric shock in warangal district
Warangal Electric Shock : వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్‌కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉండగా.. వారిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడా ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ షాక్‌కు గురైన వారిలో ముందుగా భూక్యా దేవేందర్ మృతి చెందాడు.
గాయాలపాలైన సునీల్, రవి అనే యువకులను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మంగళవారం రోజున దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తుండగా నలుగురు యువకులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. ఏడేళ్ల చిన్నారి యశ్వంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుత్ షాక్ ఘటనపై స్పందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సంఘటనా స్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు.