కానిస్టేబుల్ ను చితకబాదిన ముగ్గురు ఎస్సైలు

చిత్తూరు : శ్రీకాళహస్తిలో పోలీసులు రెచ్చిపోయారు. తోటి ఉద్యోగిపైనే విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి సమయంలో స్నేహితులతో కలసి ఓ దాబాలో ఉండటాన్ని ఓ ట్రైనీ ఎస్‌ఐ గుర్తించారు. ఈ సమయంలో అక్కడ ఏం చేస్తున్నారంటూ అనిల్ కుమార్‌తో గొడవకు దిగాడు. తను కూడా పోలీసుశాఖలోనే పనిచేస్తున్నానని అనిల్‌కుమార్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అనంతరం ఆ విషయాన్ని ఎస్ఐ మరో ఇద్దరు ఎస్సైల దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్‌కుమార్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించుకున్న ఎస్సైలు అతన్ని లాఠీలతో శరీర భాగాలు కుమిలిపోయేలా చితకబాదారు. ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లడంతో…ఎస్పీ అన్బురాజన్ ఘటనపై విచారణకు ఆదేశించారు.