శ్రావణి ఆత్మహత్య కేసులో పుటకో మలుపు.. కొత్త విషయాలు వెలుగులోకి..

TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య కేసు పుటకో మలుపు తిరుగుతోంది. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది గందరగోళంగా మారింది. శ్రావణి ఆత్మహత్యకు వీరిద్దరిలో ఎవరు కారణం తెలుసుకునే పనిలో పడ్డారు ఎస్ఆర్ నగర్ పోలీసులు.. వేగంగా దర్యాప్తు చేపడుతున్నారు. దేవ్ రాజ్‌ను గంటల తరబడి పోలీసులు విచారించారు.
గతంలో జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రావణిని దేవరాజ్ కలిసి మాట్లాడాడు.. దేవరాజ్‌పై తనకున్న ప్రేమను చెబుతూ శ్రావణి తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ క్రమంలో దేవరాజ్‌పై శ్రావణి కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు శ్రావణి కుటుంబ సభ్యులకు దేవరాజ్ బెదిరించారని విచారణలో వెల్లడించాడు. దేవరాజ్‌పై దాడికి శ్రావణి కుటుంబ సభ్యులు పాల్పడ్డారు.. దీంతో శ్రావణిని రోడ్డుపైకి ఈడుస్తానంటూ దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. విషయం తెలుసుకుని దేవరాజ్‌పై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో శ్రావణి ఫిర్యాదు చేసింది.
దేవరాజ్‌పై 354 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు రెండు రోజులు ముందు శ్రావణిని దేవరాజ్ కలిసినట్టు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అక్కడికి సాయిరెడ్డి వచ్చారని విచారణలో తేలింది. మాటామాటా పెరిగి సాయిరెడ్డి, దేవరాజ్ మళ్లీ గొడవపడ్డారు. ఇక శ్రావణి తన కుటుంబీలకు ప్రేమ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.. శ్రావణి కుటుంబ సభ్యులకు పలుమార్లు దేవరాజ్ బెదిరించినట్టు వారు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. గతంలో తనను రక్తం వచ్చేలా కొట్టాడంటూ పోలీసులకు చెప్పాడు. తనను శ్రావణి ఎంతగా ప్రేమించిందో ఫొటోలు, వీడియోలను ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు. సాయి కుటుంబసభ్యులతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇక్కడ దేవ్ రాజ్ కారణమని శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
దేవరాజు పోలీసులకు ఇచ్చిన ఆడియో ఆధారాలు 10టీవీకి చిక్కాయి. సాయి, నిర్మాత అశోక్ బెదిరించిన ఆడియోలు కూడా ఇచ్చాడు. సాయి, ఆశోక్ ప్రోద్బలంతోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని, ఆ విషయాన్ని శ్రావణేనే చెప్పిందని దేవరాజు ఆడియో చూపించాడు.. శ్రావణి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని మొదట చెప్పిన దేవరాజు.. తర్వాత అతడికి శ్రావణికి మధ్య బ్యాంకు లావాదేవీలను పోలీసులు గుర్తించారు.
మరోవైపు విచారణకు హాజరు కావాలని సాయి రెడ్డి.. నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2020, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం విచారణకు హాజరు కానున్నారు. శ్రావణి, సాయిలు కలిసి టిక్ టాక్ చేసిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సాయిను విచారిస్తే తప్పా చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తోంది.