Whatsapp Chatting : వాట్సప్ చాటింగ్‌పై భార్యకు భర్త మందలింపు.. ఫలితం రెండు చావులు

ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ రెండు కుటుంబాల్లోవిషాదం నింపింది.

Whatsapp Chatting : వాట్సప్ చాటింగ్‌పై భార్యకు భర్త మందలింపు.. ఫలితం రెండు చావులు

Whatsapp Chatting

Updated On : March 7, 2022 / 5:20 PM IST

Whatsapp Chatting :  నేడు స్మార్ట్ ఫోన్ యుగం.. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేదు.. అదే సమయంలో సోషల్ మీడియా జీవితంలో భాగమైపోయింది. అయితే హద్దుల్లో ఉన్నంతవరకే ఏదైనా హద్దు దాటితే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.. వాట్సాప్ జీవితాలు నాశనం చేస్తోంది.

సంసారాల్లో నిప్పులు పోస్తోంది.. ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ రెండు కుటుంబాల్లోవిషాదం నింపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యం పేట గ్రామానికి చెందిన మౌనిక(25) అనే వివాహిత ప్రశాంత్ అనే వ్యక్తితో ఫోన్ లో Whatsapp chatting  చేయసాగింది.
Also Read :Bheemla Nayak: వచ్చాడు భీమ్లా.. గ్రానైట్ బాంబ్‌లా.. రాప్‌సాంగ్ వచ్చేసింది
ఈసంగతి ఆమె భర్తకు తెలిసింది. పరిచయం లేని, తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయవద్దు అని భార్యను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మౌనిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read :AP Cabinet approves: కీల‌క చ‌ట్టాల‌ స‌వ‌ర‌ణ‌లకు ఏపీ కేబినెట్ ఆమోదం..రెండో భాష‌గా ఉర్దూ
కాగా …..మృతురాలు మౌనిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆమెతో Whatsapp chatting  చేసిన మొటపలకుల ప్రశాంత్(32) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక పాప ఉంది. మొత్తానికి రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.