Cheating: డబ్బున్న వృద్ధులే టార్గెట్.. పెళ్లి పేరుతో ఘరానా మోసం.. మహా నగరంలో మాయలేడీలు..
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Cheating: మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఇద్దరు కిలేడీల బాగోతం బట్టబయలైంది. పెళ్లి పేరుతో వారు చేస్తున్న చీటింగ్ వెలుగుచూసింది. ఆ మహిళల టార్గెట్ వృద్ధులు. పెళ్లి చేస్తామని నమ్మిస్తారు. ఆ తర్వాత డబ్బుతో పరార్ అవుతారు.
వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసం చెస్తున్నారు ఇద్దరు మహిళలు. సంపన్నులు, రిటైర్ అయిన ఉద్యోగులను వారు టార్గెట్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇచ్చి వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఓ వృద్ధుడికి పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు మహిళలు. పెళ్లి బట్టలు వేసుకుని వృద్ధుడు పెళ్లి కోసం సిద్ధంగా ఉన్నాడు.
అయితే, సమయానికి మహిళలు రాకపోవడంతో తాను మోసపోయానని వృద్ధుడు గ్రహించాడు. వెంటనే మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిలేడీల బండారం బట్టబయలైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆ ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.