Extra-Marital Relationship Suicide : ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

కొత్తగూడెం జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది. వివాహేతరం సంబంధం ఏర్పరుచుకున్న ఇద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రశాంత్‌, ప్రసన్నలక్ష్మి.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా లక్ష్మి వేరుగా ఉంటోంది. ఈ సమయంలోనే డ్రైవర్‌ ప్రశాంత్‌తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

Extra-Marital Relationship Suicide : ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

extra-marital relationship suicide

Updated On : August 8, 2022 / 7:01 PM IST

extra-marital relationship suicide : కొత్తగూడెం జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది. వివాహేతరం సంబంధం ఏర్పరుచుకున్న ఇద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూలూరుపాడు మండలం వినోభానగర్‌కు చెందిన ప్రశాంత్‌, ప్రసన్నలక్ష్మి.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ప్రశాంత్‌కు ఇద్దరు పిల్లలున్నారు. లక్ష్మికి ఒక బాబు ఉన్నాడు.

అయితే భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా లక్ష్మి వేరుగా ఉంటోంది. ఈ సమయంలోనే డ్రైవర్‌ ప్రశాంత్‌తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై తీరు మార్చుకోవాలంటూ ఇద్దరినీ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కొత్తగూడెంలో ఎస్సై కోచింగ్‌ తీసుకుంటున్న ప్రసన్న లక్ష్మి.. ప్రశాంత్‌తో కలిసి ఖమ్మం వెళ్లింది.

Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య

అక్కడే ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వీరిని గమనించిన స్థానిక లారీ డ్రైవర్లు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.