రెండు వర్గాలు పరస్పర దాడి : ఐదుగురి పరిస్థితి విషమం

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 01:15 PM IST
రెండు వర్గాలు పరస్పర దాడి : ఐదుగురి పరిస్థితి విషమం

Updated On : March 31, 2019 / 1:15 PM IST

శ్రీకాకుళం : జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రేగడి ఆముదాలవలస మండలం దేవదలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 15 మందికి గాయాలు అయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పాలకొండ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మళ్లీ గొడవలు జరుగకుండ గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.