Three Assaulted Swiggy Delivery Boys : హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు దాడి

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువకుల దాడికి పాల్పడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో చైతన్య పురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భవాని చౌరస్తా దగ్గర మద్యం తాగిన మైకంలో ఇద్దరు స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు.

Three Assaulted Swiggy Delivery Boys : హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు దాడి

three attack Swiggy delivery boys

Updated On : September 17, 2022 / 5:53 PM IST

Three Assaulted Swiggy Delivery Boys : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువకుల దాడికి పాల్పడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో చైతన్య పురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భవాని చౌరస్తా దగ్గర మద్యం తాగిన మైకంలో ఇద్దరు స్విగ్గి డెలివరీ బాయ్స్‌పై ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. కిరణ్‌ అనే స్విగ్గి డెలివరీ బాయ్‌పై ముందుగా ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు.

అడ్డుకోబోయిన ప్రవీణ్‌ అనే యువకుడిని సైతం ఇష్టమొచ్చినట్లు కొట్టారు. స్విగ్గి బాయ్స్‌ను కొట్టి పారిపోతున్న యువకులను స్విగ్గి బాయ్స్‌ వెంటాడి మరీ పట్టుకున్నారు. అనంతరం వీరిని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అయితే దాడి చేసిన ఇద్దరు యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు సమాచారం.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

ముగ్గురు యువకులు తప్ప తాగి దాడి చేశారని స్థానికులు అంటున్నారు. అటు యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన స్విగ్గి బాయ్స్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.