రైల్వే ట్రాక్‌పై TikTok : ముగ్గురిని ఈడ్చుకెళ్లిన రైలు.. ఇద్దరు మృతి
టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం యూజర్లు.. టిక్ టాక్ వీడియోలే అప్ లోడ్ చేస్తుంటారు.

టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం యూజర్లు.. టిక్ టాక్ వీడియోలే అప్ లోడ్ చేస్తుంటారు.
టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం యూజర్లు.. టిక్ టాక్ వీడియోలే అప్ లోడ్ చేస్తుంటారు. చిన్నారుల నుంచి యువకుల వరకు అందరూ టిక్ టాక్ బాట పడుతున్నారు. ఏదో ఒకటి వీడియో తీయడం ఫేస్ బుక్, ట్విట్టర్లో పోస్టు చేయడం కామన్ అయిపోయింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలామంది యువకులు టిక్ టాక్ వీడియోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్నిసార్లు వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు రైల్వే ట్రాక్ పై టిక్ టాక్ వీడియో తీసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన చిక్కాబల్లాపూర్-బెంగళూరు రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటన బెంగళూరులోని యలహంక, చన్నసండ్రా మధ్య రైల్వే ట్రాక్‌పై జరిగింది.
మృతులిద్దరిలో అఫ్తబ్ షరీఫ్ (19), అతని స్నేహితుడు మహమ్మద్ మాటిన్ (23)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని మూడో స్నేహితుడు జబియుల్లా ఖాన్ (22) టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తున్నాడు. ఇతడు కూడా గాయపడ్డాడు. రైలు ఢీకొట్టడంతో ఖాన్‌ను కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న జబియుల్లాను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
ముగ్గురు యువకులు.. బెంగళూరులోని ఆర్కే హెగ్డే నగర్ ప్రాంత నివాసులుగా పోలీసులు విచారణలో గుర్తించారు. యలహంక-కోలర్-చిక్కబల్లపూర ప్యాసింజర్ రైలులోని లోకో పైలట్ ఈ ముగ్గురు యువకులను తప్పుకోండంటూ వరుసగా విజిల్స్ వేశాడు. వీరికి రైలు విజిల్స్ వినిపించలేదని చెప్పినట్టు పోలీసులు తెలిపారు.