లాక్ డౌన్ లో హృదయవిదారకం, ఆకలి తీర్చలేక పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట శాపంగా మారుతోంది.

  • Published By: naveen ,Published On : May 19, 2020 / 05:32 AM IST
లాక్ డౌన్ లో హృదయవిదారకం, ఆకలి తీర్చలేక పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

Updated On : May 19, 2020 / 5:32 AM IST

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట శాపంగా మారుతోంది.

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట శాపంగా మారుతోంది. పనులు లేవు పైసలు లేవు. దీంతో ఆకలి కేకలు, పస్తులు. ఈ పరిస్థితుల్లో జీవించలేక కొందరు ఉసురు తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ విషాద ఘటన దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదల దయనీయ స్థితికి అద్దం పడుతుంది. లాక్ డౌన్ తో ఉపాధి కరువై పిల్లల ఆకలి తీర్చలేక ఓ కూలీ తండ్రి చేసిన పని అందరిని కంటతడి పెట్టిస్తోంది. పిల్లలను చంపిన ఆ తండ్రి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

పేదల పాలిట శాపంగా మారిన లాక్ డౌన్:
తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు(రాజేశ్వరి-12,శాలిని-10), కుమారుడిని(సేతురామన్-8) చంపిన తండ్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పేరు ఆర్ముగుం. రోజు కూలీ. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు. లాక్ డౌన్ కు ముందు వరకు అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. వచ్చిన దాంతో సంతోషంగా బతికారు. కానీ కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. 

పిల్లల ఆకలి తీర్చలేక:
2 నెలలుగా ఉపాధి లేకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. ముగ్గురు పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆకలి వేస్తోందని పిల్లలు ఏడుస్తుంటే చూస్తూ తానూ ఏడ్వటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆర్ముగం అనుకున్నాడు. తాను చనిపోతే పిల్లలు మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారని భయపడ్డాడు. పిల్లలను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలను బయటకు తీసుకెళ్తున్నానని భార్యకు చెప్పాడు. వారిని ఊరి చివర పొలాల మధ్య ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్లాడు. పిల్లల కాళ్లకు పెద్ద రాయి కట్టిన ఆర్ముగం వారిని బావిలోకి తోసేశాడు. దీంతో వారు జలసమాధి అయ్యారు. ఆ తర్వాత తను ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

ఆత్మ నిర్భర భారత్ వల్ల ప్రయోజనం ఏంటి?
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వారి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమా లేఖ మరో కారణం ఏదైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అందరిని కంటతడి పెట్టించింది. నిరుపేదలు, వలకూలీల దయనీయ స్థితికి అద్దం పట్టింది. కేంద్రం లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటిస్తోంది, మరి ఆ డబ్బంతా ఏమైంది? అని జనాలు అడుగుతున్నారు. నిరుపేదలకు కేంద్రం ఎలాంటి భరోసా ఇచ్చిందో చెప్పాలంటున్నారు. నిరుపేదలు, కూలీలకు నేరుగా లబ్ది చేకూరేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఇలాంటి ఆకలి చావులు మరిన్ని చూడాల్సి వస్తుందన్నారు.

Read: వివాహేతర సంబంధం…మహిళతో సహా ప్రియుడి హత్య