దారుణం : తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడని దళిత యువకుడి సజీవదహనం

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పరువు హత్య చోటు చేసుకుంది. కులం పేరుతో ఉన్మాదానికి తెగబడ్డారు. నిండు ప్రాణం తీసేశారు. తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 02:28 AM IST
దారుణం : తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడని దళిత యువకుడి సజీవదహనం

Updated On : September 17, 2019 / 2:28 AM IST

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పరువు హత్య చోటు చేసుకుంది. కులం పేరుతో ఉన్మాదానికి తెగబడ్డారు. నిండు ప్రాణం తీసేశారు. తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పరువు హత్య చోటు చేసుకుంది. కులం పేరుతో ఉన్మాదానికి తెగబడ్డారు. నిండు ప్రాణం తీసేశారు. తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఊగిపోయిన కొందరు వ్యక్తులు ఓ దళిత యువకుడిని చితక్కొట్టారు. అప్పటికీ వారి కోపం చల్లారలేదు. ఆ తర్వాత అతడిని సజీవదహనం చేశారు. ఇది తెలిసి అతని తల్లి షాక్ కు గురై చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. హర్దోయి జిల్లా బదేస గ్రామానికి చెందిన అభిషేక్(20) ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. శనివారం(సెప్టెంబర్ 14,2019) రాత్రి ఆ యువకుడు ప్రియురాలిని కలిశాడు. ఇంటికి తిరిగొస్తుండగా అతడిని యువతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తక్కువ కులానికి చెందిన నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందా అని తీవ్రంగా కొట్టారు. నీకు ఎంత ధైర్యం అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. ఆ తర్వాత ఎవరూ లేని ఇంట్లో ఆ యువకుడిని పడేసి నిప్పంటించారు.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స కోసం లక్నోకి తరలిస్తుండగా మార్గంలోనే చనిపోయాడు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటున్న కుమారుడు ఇక లేడు అనే వార్త తెలిసి అతని తల్లి గుండెలు పగిలేలా రోదించింది. చివరికి ప్రాణాలు విడిచింది. పరువు హత్య ఘటన సంచలనం రేపింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కులం పేరుతో ప్రాణం తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.