Vande Bharat Express Hit Cow : ఆవును ఢీకొట్టిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాల‌కు గాంధీన‌గ‌ర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్ట‌డంతో రైలు ముందు భాగానికి సొట్ట‌ప‌డింది. ఘ‌ట‌న కార‌ణంగా 10 నిమిషాలు ఆగిపోయిన రైలు తిరిగి బ‌య‌లుదేరింది. కాగా, గురువారం కూడా కొత్త‌గా ప్రారంభ‌మైన సెమీ హైస్పీడ్ రైలు నాలుగు బ‌ర్రెల‌తో కూడిన మంద‌ను ఢీకొట్టింది.

Vande Bharat Express Hit Cow : ఆవును ఢీకొట్టిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

Vande Bharat Express Hit Cow

Updated On : October 7, 2022 / 9:11 PM IST

Vande Bharat Express Hit Cow : వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ సాయంత్రం 3:44 నిమిషాల‌కు గాంధీన‌గ‌ర్-ముంబై మార్గంలో అవును ఢీకొట్ట‌డంతో రైలు ముందు భాగానికి సొట్ట‌ప‌డింది. ఘ‌ట‌న కార‌ణంగా 10 నిమిషాలు ఆగిపోయిన రైలు తిరిగి బ‌య‌లుదేరింది. కాగా, గురువారం కూడా కొత్త‌గా ప్రారంభ‌మైన సెమీ హైస్పీడ్ రైలు నాలుగు బ‌ర్రెల‌తో కూడిన మంద‌ను ఢీకొట్టింది.

రైలు ముంబై నుంచి గాంధీన‌గ‌ర్‌కు వెళ్తుండ‌గా ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో అహ్మ‌దాబాద్ స‌మీపంలో బెట్వా-మ‌నీన‌గ‌ర్ స్టేష‌న్‌ల మ‌ధ్య ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు ముందు భాగం ప‌గిలిపోయింది. ఈ రెండు ఘ‌ట‌న‌లు రైలు మెటీరియ‌ల్‌లో నాణ్య‌త‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Express Trains Speed Increased : ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంపు.. రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

బ‌ర్రెలు, ఆవులను ఢీకొన్న రైలు ముందు భాగం దెబ్బ‌తిన‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొచ్చిన రైలు ఇంత బ‌ల‌హీన‌మా అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. కానీ ప్ర‌భుత్వం మాత్రం రైలు నాణ్య‌త‌పై ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌ని అంటోంది. డ్యామేజీ అయినా తిరిగి కొత్త భాగాన్ని అమ‌ర్చేలా రైలు ముందు భాగాన్ని ఫైబ‌ర్‌తో డిజైన్ చేశార‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.