Gun Misfire : తుపాకీ మిస్ ఫైర్ – హోంగార్డు భార్య మృతి

విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Gun Misfire : తుపాకీ మిస్ ఫైర్ – హోంగార్డు భార్య మృతి

Gun Misfire

Updated On : April 12, 2021 / 1:30 PM IST

Home guard”s wife died due to Gun misfire : విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఏ.ఎస్పీ శశికాంత్ దగ్గర వినోద్ అనే హోంగార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం శశికాంత్ క్యాంప్ కు వెళుతూ గన్ వినోద్ కు ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా సోమవారం తెల్లవారు ఝూమున, సుమారు 2 గంటల సమయంలో వినోద్ విధులుముగించుకుని గొల్లపూడి లోని తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యకు గన్ చూపిస్తుండగా అది మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ వినోద్ భార్య సూర్య రత్నప్రభ గుండెల్లోకి దూసుకు వెళ్లింది. అక్కడికక్కడే రత్నప్రభ మరణించింది.

సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన భవానీపురం పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని వినోద్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.

వినోద్ కావాలనే భార్యను తుపాకీతో కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వినోద్ నైట్ డ్యూటీ చేస్తున్నాడని.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన వినోద్ కు, అతని భార్య రత్నప్రభకు మధ్య నగల విషయంలో గొడవ జరిగింది. కోపం అదుపు చేసుకోలేక పోయిన వినోద్ తుపాకీతో భార్యను కాల్చి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.