Visakha Sai Case : విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసులో అనుమానాలు ఎన్నో.. అసలేం జరిగింది?

సాయి, షణ్ముఖ్ కి ఇంతకుముందే పరిచయం ఉందా? ఫోటో షూట్ ఈవెంట్ లో గొడవలు ఏమైనా జరిగాయా?

Visakha Sai Case : విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసులో అనుమానాలు ఎన్నో.. అసలేం జరిగింది?

Visakha Photographer Sai Case

Updated On : March 3, 2024 / 5:37 PM IST

Visakha Sai Case : విశాఖకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. 12లక్షల రూపాయల విలువైన కెమెరాల కోసమే సాయిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. షణ్ముఖ్ అతడి స్నేహితుడు కలిసి సాయిని మర్డర్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.

అయితే ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. అసలేం జరిగింది? సాయి, షణ్ముఖ్ కి ఇంతకుముందే పరిచయం ఉందా? ఫోటో షూట్ ఈవెంట్ లో గొడవలు ఏమైనా జరిగాయా? కెమెరా ఎక్విప్ మెంట్ కోసమే మర్డర్ చేశారా? ఇలాంటి అనుమానాలు ఎన్నో. ఈ మర్డర్ వెనుక మిస్టరీని పూర్తిగా చేధించే దిశగా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

సాయి కేసులో అనుమానాలు ఎన్నో..
1. రూ.12లక్షలు విలువ చేసే కెమెరా ఎక్విప్ మెంట్ కోసమే హత్య చేశారా?
2. పాత గొడవలు ఏమైనా ఉన్నాయా?
3. ప్రీ వెడ్డింగ్ షూట్ లో గొడవలు జరిగాయా?
4. మృతుడు సాయి, నిందితుడు షణ్ముఖ్ కు ఇంతకు ముందే పరిచయం ఉందా?
5. సాయి, షణ్ముఖ్ కి పరిచయం ఎలా ఏర్పడింది?
6. ఆర్థికపరమైన వివాదాలే కారణమా?

కెమెరా వెనుక క్రైమ్ కథ
1. మదురవాడలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సాయి దారుణ హత్య
2. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న సాయి(23)
3. రావులపాలెంలో సాయిని హత్య చేసిన ష్మణుఖ్
4. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం రావులపాలెం వెళ్లిన సాయి
5. 15 రోజుల వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం రావులపాలెం వెళ్లిన సాయి
6. 26వ తేదీ సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్చాఫ్
7. 29వ తేదీ వరకు ఆచూకీ లేని సాయి
8. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాఫ్తు
9. రావులపాలెం ఆలుమూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు
10. కెమెరా ఎక్విప్ మెంట్ కోసమే హత్య చేశారా?
11. పాత గొడవలు ఏమైనా ఉన్నాయా?
12. పలు కోణాల్లో పోలీసుల విచారణ

Also Read : మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో కీలక పరిణామం.. రూ.580 కోట్ల ఆస్తులు ఫ్రీజ్