బెంగాల్ లో టెన్షన్..టెన్షన్ : బీజేపీ కార్యకర్త మృతి

వెస్ట్ బెంగాల్ లోని జార్ గ్రామ్ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త మృతితో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఈస్ట్ మిడ్నాపూర్ లోని భగబన్ పూర్ లో అనంత గుచైటీ, రంజిత్ మైటీ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై రాత్రి కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడ్డ వీరిని హాస్పటల్ కు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ లో భాగంగా వెస్ట్ బెంగాల్ లో 8 స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లో జార్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి.