Wife Beaten Husband Head : కూర బాగోలేదన్నాడు….తల పగలగొట్టిన భార్య

హర్యానాలోని ఒక కుటుంబంలో కూరబాగోలేదన్నాడని భర్త తల పగల గొట్టింది అతని భార్య.

Wife Beaten Husband Head : కూర బాగోలేదన్నాడు….తల పగలగొట్టిన భార్య

Wife Beaten Husband

Updated On : September 7, 2021 / 9:18 PM IST

Wife Beaten Husband Head : భార్యా భర్తలు అన్నాక ఏవో అలకలు, వాదనలు, గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. మళ్లీ తెల్లారేసరికి ఒకరికొకరు కలిసిపోతుంటారు. వాటిలో పట్టువిడుపులు ఉండాలి…. ఉంటాయి కూడా… కానీ హర్యానాలోని ఒక కుటుంబంలో కూరబాగోలేదన్నాడని భర్త తల పగల గొట్టింది అతని భార్య.

హిసార్ జిల్లా బార్వాలా పట్టణంలో బిందియా, దినేష్ దంపతులు నివసిస్తున్నారు. ప్రతిరోజూలాగానే భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. భార్య అతనికి భోజనం వడ్డించింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని భావించిన దినేష్(40) అదే విషయాన్ని చెప్పాడు. కూర రుచిగాలేదని కామెంట్ చేశాడు. దీంతో భార్యా భర్తల మధ్య గొడవ మొదలయ్యింది.

భర్త మీద కోపంతో ఉన్న బిందియా పక్కనే ఉన్న ఇనుపరాడ్ తీసుకుని భర్త దినేష్ తలపై కొట్టింది. దినేష్ తల పగిలి తీవ్ర రక్త స్రావం అయ్యింది. వీరి గొడవ గమనించిన ఇరుగుపొరుగువారు ఈలోపు ఇంటికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన దినేష్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఈ ఘటనపై దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచూ ఇంట్లో ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయని దినేష్ ఫిర్యాదులో పేర్కోన్నాడు.