ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్
కరీంనగర్‌లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని

కరీంనగర్‌లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
కరీంనగర్‌లో దారుణం జరిగింది. భర్తను చంపేందుకు ఓ భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… భార్య బాగోతం బట్టబయలైంది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణకు, కావేరి అనే యువతితో పెళ్లైంది. కాగా, కావేరికి ఇద్దరు ప్రియుళ్లు ఉన్నారు. భర్తకు తెలియకుండా కావేరి వ్యవహారం నడిపిస్తోంది. ఓ రోజు భార్య సెల్ ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూసి భర్త వంశీ షాక్ తిన్నాడు. తన ఇద్దరు ప్రియుళ్లతో కావేరీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసిన అతడు.. ఈ విషయం గురించి భార్యను ప్రశ్నించాడు. దీంతో కావేరీ భయపడిపోయింది. తన గుట్టు బయటపడిపోవడంతో భర్తను అంతం చేయాలని డిసైడ్ అయ్యింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది.
వంశీ నిద్రపోతున్న సమయంలో తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి అతడి ముఖం మీద దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని ప్లాన్ వేసింది. అది అమలు చేసే క్రమంలో బాధితుడు వారి నుంచి తప్పించుకుని గోడ దూకి పారిపోయాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత భార్యా బాధితుల సంఘాన్ని కూడా ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితులు సమాన్విత్, గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియుళ్లతో కలిసి భర్తను చంపేందుకు భార్య వేసిన ప్లాన్ పోలీసులతో పాటు స్థానికులను షాక్ కి గురి చేసింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా అని అంతా విస్తుపోతున్నారు. ఆమెని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.