Visakhapatnam Incident : మనిషి కాదు సైకో.. ఆ వీడియోలు చూపి అలానే చేయాలంటూ భర్త టార్చర్.. తట్టుకోలేక భార్య బలవన్మరణం..! పెళ్లైన 11 నెలలకే..

ఇదే విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులతో చెప్పుకుని పలుమార్లు వాపోయింది.

Visakhapatnam Incident : మనిషి కాదు సైకో.. ఆ వీడియోలు చూపి అలానే చేయాలంటూ భర్త టార్చర్.. తట్టుకోలేక భార్య బలవన్మరణం..! పెళ్లైన 11 నెలలకే..

Updated On : February 14, 2025 / 11:57 PM IST

Visakhapatnam Incident : కొత్తగా పెళ్లైంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో అడుగు పెట్టింది. కానీ, ఆమె ఆశలన్నీ కొన్నాళ్లకే అడియాసలయ్యాయి. కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆ మృగాడు టార్చర్ పెట్టాడు. మొదట్లో భరించింది. మారతాడులే అనుకుంది. పిచ్చి మరింతగా ముదరడంతో చివరికి తట్టుకోలేకపోయింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడింది.

విశాఖపట్నంలో ఈ ఘోరం జరిగింది. విశాఖపట్నం గోపాలపట్నం నందమూరి కాలనీకి చెందిన నాగేంద్రబాబుకు 11 నెలల కిందట వసంతతో పెళ్లైంది. కామపిచ్చితో నాగేంద్రబాబు వసంతను టార్చర్ పెట్టాడు. అశ్లీల వీడియోలు చూపించి, అందులో ఉన్నట్లే చేయాలని భార్యను వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులతో చెప్పుకుని పలుమార్లు వాపోయింది. వారు ఆమెకు నచ్చజెప్పారు.

Also Read : పని పని అని పరిగెత్తాడు.. రూ.7.8కోట్ల జీతం కొట్టాడు .. కట్ చేస్తే భార్య వదిలేసింది..

భర్త మారతాడులే అని వసంత కూడా కొన్ని రోజులు ఓపిక పట్టింది. అయితే, భర్తకు పిచ్చి తగ్గకపోగా మరింత పెరగడంతో భరించలేకపోయింది. ఇదే విషయంపై గత రాత్రి తల్లిదండ్రులతో వాపోయింది వసంత. రేపు ఉదయాన్నే వచ్చి మాట్లాడతామని వసంతకు ధైర్యం చెప్పారు కుటుంబసభ్యులు. ఇంతలోనే వసంత బలవన్మరణం చేసుకుందని వారికి ఫోన్ వచ్చింది. దీంతో వసంత కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు.

అయితే, వసంతది బలవన్మరణం కాదు హత్య అని ఆరోపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు, బంధువులు. భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ పెడుతున్నాడని, కొన్ని రోజులుగా ఈ సమస్యను తమకు చెబుతోందన్నారు వసంత తల్లిదండ్రులు. అత్త, మామ, మరిది, భర్త కలిసి వసంతను చంపేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

నవ వధువు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త నాగేంద్రబాబు శాడిజం తెలిసి అంతా షాక్ అవుతున్నాడు. ఈ కేసులో పోలీసులు భర్త నాగేంద్రబాబును అరెస్ట్ చేశారు. భర్త వేధింపుల విషయంలో అతడితో గొడవ పడిన వసంత.. పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అయితే, తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి నాగేంద్రబాబుకు వద్దకు పంపేశారు.

అప్పటికి కూడా నాగేంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదు. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన అతడు.. వసంతను టార్చర్ పెట్టడం ఆపలేదు. ఆ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేశాడు. దీన్ని సహించలేకపోయింది వసంత. ఈ విషయమై గత రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో మరో గదిలోకి వెళ్లిన వసంత ఉరి వేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగేంద్రబాబు కొంత కాలంగా శృంగారానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. తల్లిదండ్రులు నాగేంద్రబాబును ఎందుకు వారించలేకపోయారు, ఎందుకు సర్ది చెప్పలేకపోయారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లైన 11 నెలలకే వసంత ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.