Job Cost Marriage : పని పని అని పరిగెత్తాడు.. రూ.7.8కోట్ల జీతం కొట్టాడు .. కట్ చేస్తే భార్య వదిలేసింది..

ఓ టెకీ.. తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

Job Cost Marriage : పని పని అని పరిగెత్తాడు.. రూ.7.8కోట్ల జీతం కొట్టాడు .. కట్ చేస్తే భార్య వదిలేసింది..

Updated On : February 14, 2025 / 11:48 PM IST

Job Cost Marriage : ప్రతి మనిషికి జాబ్ అవసరమే. మెరుగైన జీవితం కావాలంటే మంచి ఉద్యోగం, జీతం కావాల్సిందే. కష్టపడి జాబ్ చేస్తే ఫలితం కూడా అలానే ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి, శాలరీ కూడా పెరుగుతుంది. అందరూ కోరుకునేది కూడా ఇదే. ఇందులో తప్పేమీ లేదు. కానీ, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి జాబే ముఖ్యం అనుకుంటే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మనిషికి జీవితంలో జాబ్ ఎంత అవసరమో, కుటుంబం కూడా అంతే ముఖ్యం.

ఆఫీస్ పనితో పాటు తన భార్య, పిల్లలను కూడా పట్టించుకోవాలి. వారికి సమయం కేటాయించాలి. వారితో గడపాలి. వారికి ఆనందం పంచాలి. లేదంటే.. ఆ తర్వాత జరిగే అనర్థాలను ఫేస్ చేయాల్సిందే. తాజాగా ఓ టెకీ విషయంలో ఇదే జరిగింది. ఫ్యామిలీని మర్చిపోయి మరీ జాబ్ కి అంకితమైన అతగాడిని.. చివరికి భార్య వదిలేసింది.

ప్రమోషన్ వచ్చింది. శాలరీ రూ.7.8 కోట్లు.. కానీ ఏం లాభం..

పని పని అతడు పరిగెత్తాడు.. చివరికి అనుకున్నది సాధించాడు. ప్రమోషన్ వచ్చింది. శాలరీ రూ.7.8 కోట్లు. కానీ, ఏం లాభం. భార్య అతడిని వదిలేసింది. ఎప్పుడూ పని పని అంటుంటావు.. ఇక నాతో నీకేం పని అంటూ విడాకుల నోటీసులు పంపించింది.

అనుకున్న ప్రమోషన్ వరించి 7.8 కోట్ల రూపాయల జీతం తీసుకుంటున్నా.. తన మ్యారేజ్ లైఫ్ మాత్రం ఖతమైపోయిందని ఆ టెకీ తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. కెరీర్ లో ఎంతో సాధించినా.. ఏం లాభం.. జీవితం శూన్యంగా మారిందని వాపోతున్నాడు. చివరికి అతడికి కన్నీరే మిగిలింది.

Also Read : తెల్ల జుట్టుకు బైబై చెప్పేయండి.. ఈ నేచురల్ కలర్ ట్రై చేయండి.. నిమిషాల్లో మెరిసే నల్ల జుట్టు మీ సొంతం!

జాబ్ టెన్షన్ లో ఫ్యామిలీని పట్టించుకోలేదు..
ఓ టెకీ.. తన జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ”మూడేళ్ల క్రితం ఓ సంస్థలో నేను జాయిన్ అయ్యాను. జాబ్ లో అంచెలంచెలుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు తగ్గట్టుగానే కష్టపడి పని చేశాను. ఒక్కోసారి రోజుకు 14 గంటలు కష్టపడి పని చేశాను. నేను జాబ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానంటే.. చివరికి నా ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదు.

ఆ ప్రమోషన్ నా కొంప ముంచుతుందని అస్సలు ఊహించలేదు..

ఎంతసేపు పని పని పని. ఆఫీస్ వర్క్, టెన్షన్స్ కారణంగా నా భార్యతో, నా పిల్లలతో మాట్లాడే సమయం కూడా లేకుండా పోయింది. అంత బిజీ అయిపోయాను. చివరికి నేను అనుకున్నది సాధించాను. నాకు ప్రమోషన్ వచ్చింది. జీతం 7.8 కోట్లు. నా ఆనందానికి అవధులే లేవు. అయితే, ఆ ప్రమోషన్ నా కొంప ముంచుతుందని అస్సలు ఊహించలేదు.

ఆ సమయంలోనూ భార్యకు తోడుగా లేను..
ప్రమోషన్ రావడంతో పని భారం మరింత పెరిగిపోయింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీటింగ్స్ ఉండేవి. దీంతో భార్య పిల్లలతో గడిపే సమయమే లేకుండా పోయింది. నేను ఎంత బిజీ అయ్యాను అంటే.. చివరికి నాకు పాప పుట్టినప్పుడు కూడా నేను ఆసుపత్రికి వెళ్లి చూడలేకపోయాను.

కూతురు పుట్టినప్పుడు మీటింగ్ లో ఉన్నా..

నా మీటింగ్స్ లో నేను ఫుల్ బిజీగా ఉన్నాను. ప్రసవం తర్వాత నా భార్య డిప్రెషన్ తో బాధపడింది. ఆ సమయంలోనూ నేను ఆమెకు తోడుగా లేను. కూతురు పుట్టిన సమయంలో నేను అక్కడ లేను. నా భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు కూడా ఆమెను డాక్టర్ కు తీసుకెళ్లలేకపోయాను. దీనికి కారణం నా ఉద్యోగ బాధ్యతలు, మీటింగ్స్.

చివరికి ఊహించని ఫలితం ఎదురైంది. నా తీరుతో విసిగిపోయిన నా భార్య.. నన్ను వదిలేసింది. విడాకులు కోరుతూ నోటీసులు పంపించింది.

Also Read : మీ సిబిల్ స్కోరు తగ్గడానికి 5 కారణాలివే.. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయెద్దు..!

7.5 కోట్ల రూపాయల జీతం.. మ్యారేజ్ లైఫ్ ఖతం..
అప్పుడు కానీ, నాకు అర్థం కాలేదు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో. ఉద్యోగంలో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించానని, ప్రమోషన్ వచ్చిందని, జీతం పెరిగిందని ఆనందించాలో.. నా భార్య నన్ను వదిలేసిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది” అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఆ టెకీ.