Drinking Habit: భర్తల్ని ఇలా కూడా మార్చొచ్చా..? మద్యానికి బానిసైన భర్తను ఎలా మార్చిందో తెలిస్తే షాక్ అవుతారు

దీంతో భర్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాడు. తన భార్య మద్యానికి బానిసని, ఆమె ప్రవర్తనతో కుటుంబానికి అగౌరవం తెచ్చిందని భర్త పేర్కొన్నాడు. మద్యం మత్తులో వ్యవహారిస్తున్న భార్య తనను తరిమికొట్టిన వీడియోను భర్త కౌన్సెలర్‌కు చూపించాడు

Drinking Habit: భర్తల్ని ఇలా కూడా మార్చొచ్చా..? మద్యానికి బానిసైన భర్తను ఎలా మార్చిందో తెలిస్తే షాక్ అవుతారు

Updated On : May 15, 2023 / 8:37 PM IST

Uttar Pradesh: ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ప్రయత్నం సరిగా ఉంటే చాలా సందర్భాల్లో ఇది వర్కౌట్ అవుతుంది. ఇదే నిరూపించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ. మద్యానికి బానిసైన భర్తను అదే మార్గంలో వెళ్లి మార్చేసింది. అంటే ఆమె కూడా మద్యానికి బానిస అయ్యిందన్నమాట. అయితే ఇలా చేస్తున్న తరుణంలో తాను చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు ఆ మహిళ వాపోయింది.

Zelensky: ఉన్నట్టుండి యూకేలో కనపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎందుకంటే?

ఆగ్రాకు చెందిన ఒక వ్యక్తి రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. కోపంతో ఆమెను కొడుతున్నాడు కూడా. ఆమె ఎంత వారించినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు మారలేదు. దీంతో భర్త ముందు తాను తాగుబోతులా నటించింది. అతడితో గొడవపడడం ప్రారంభించింది. భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు కానీ, మారలేదు. ఇలా నటిస్తున్న క్రమంలో ఆమె మద్యానికి బానిసైంది. ఇద్దరి మధ్య గొడవలు, ఫైట్లు పెరిగాయి.

Tech Tips in Telugu : గూగుల్ పే, పోన్‌పే, పేటీఎంతో UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

దీంతో భర్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించాడు. తన భార్య మద్యానికి బానిసని, ఆమె ప్రవర్తనతో కుటుంబానికి అగౌరవం తెచ్చిందని భర్త పేర్కొన్నాడు. మద్యం మత్తులో వ్యవహారిస్తున్న భార్య తనను తరిమికొట్టిన వీడియోను భర్త కౌన్సెలర్‌కు చూపించాడు. మద్యం మత్తులోనే ఉన్న ఇద్దరు కౌన్సిలర్ ముందే విపరీతంగా దూషించుకున్నారు.

Digvijaya Singh: హిందుత్వం ధర్మం కాదట, బజరంగ్ దళ్ గూండాల గ్రూపట.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన దిగ్గీ

అయితే కౌన్సిలింగ్ సెంటరులో అసలు విషయం బయటపడింది. భర్తను మార్చే ఉద్దేశంతో భార్య చేసిన ప్రయత్నాలు చివరికి ఆమెను తాగుబోతు చేశాయని. ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి, రాతపూర్వక ఒప్పందం తీసుకున్నారు. వారానికి ఒకసారి మాత్రమే తాగుతానని కౌన్సెలర్ సమక్షంలో భర్త లిఖితపూర్వక హామీ ఇచ్చాడు. అతను తన భార్యతో ఎప్పుడూ గొడవపడనని, వాదించనని వాగ్దానం చేశాడు.