Zelensky: ఉన్నట్టుండి యూకేలో కనపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎందుకంటే?

ఉక్రెయిన్ పై రష్యా ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోతోంది.

Zelensky: ఉన్నట్టుండి యూకేలో కనపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎందుకంటే?

Zelensky

UK: ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇవాళ యూకేలో కనపడి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రధాని రిషి సునక్ (Rishi Sunak)తో ఆయన సమావేశమయ్యారు. ఆదివారం జర్మనీకి వెళ్లిన జెలెన్ స్కీ… బెర్లిన్‌లో జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ తో పాటు ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశమైన విషయం తెలిసిందే.

రష్యాపై పోరుకు ఉక్రెయిన్ కు జర్మనీ భారీగా సాయం చేసింది. అక్కడి నుంచి జెలెన్ స్కీ నేరుగా బ్రిటన్ కు వెళ్లారు. ముందస్తు సమాచారం తెలపకుండా ఆయన ఆ దేశంలో పర్యటిస్తుండడం గమనార్హం. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న వేళ ఆయన ఇంతకు ముందు కూడా పలు దేశాల్లో ఇలాగే అకస్మాత్తుగా పర్యటించారు.

ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని యూకే ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ తెలిపారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. విదేశాల సాయంతో రష్యాపై ఉక్రెయిన్ పోరాడుతోంది.

China: 78 ఏళ్ల అమెరికా పౌరుడికి చైనా యావజ్జీవ కారాగార శిక్ష.. ఎందుకంటే?