Blast : మేడ్చల్ జిల్లాలో పేలుడు-మహిళ మృతి
మేడ్చల్ జిల్లాలో నిన్న పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక మహిళ మృతి చెందింది.

Medchal Blast
Blast : మేడ్చల్ జిల్లాలో నిన్న పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక మహిళ మృతి చెందింది. జిల్లాలోని బహదూర్ పల్లిలోని ఒక కన్వెన్షన్ హాలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నమహిళ పేలుడు ధాటికి శరీరం చిధ్రమై అక్కడి కక్కడే మృతి చెందింది. కామారెడ్డికి చెందిన జయరాజ్, లక్ష్మీ(2) లు బహుదూర్ పల్లిలోని ఎస్‌బీవీకే ఫంక్షన్ హాలులో సెక్యూరిటీ ఉంటూ పని చేస్తున్నారు.
శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ డబ్బాను కడిగేందుకు లక్ష్మి ప్రయత్నించగా… ఆ డబ్బా నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆమె శరీరం ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు క్లూస్ టీం తో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డబ్బాలో ఏముంది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
Also Read : RGV : ద్రౌపది జీ గొప్ప రాష్ట్రపతి అవుతారు.. బీజేపీకి నా ధన్యవాదాలు అంటూ వర్మ ట్వీట్..