అంత్యక్రియలకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 02:44 AM IST
అంత్యక్రియలకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు

Updated On : November 2, 2019 / 2:44 AM IST

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది. వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా డిండి మండలం, లింగరాజు పల్లి గ్రామానికి చెందిన వెలిమినేటి అంజయ్య, అంజమ్మ (45) దంపతులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని వీకర్‌ సెక్షన్‌కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు వెంకటేష్, ప్రేమ్‌కుమార్, కుమార్తె జ్యోతిరాణి ఉన్నారు. అంజయ్య కూలీ పనులకు వెళ్తాడు. అంజమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది.

నల్గొండ జిల్లాలోని దేవరకొండలో నివాసముంటున్న అంజమ్మ బావ చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అక్క కూతురు రాజేశ్వరి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి మెహిదీపట్నం నుంచి శుక్రవారం (నవంబర్ 1, 2019) ఉదయం 6 గంటలకు బయలుదేరారు. ఉదయం 7 గంటలకు సాగర్ రింగ్‌రోడ్డుకు చేరుకుని అంజమ్మ, రాజేశ్వరితో పాటు ఇద్దరు పిల్లలు ఇబ్రాహీంపట్నం బస్టాప్ వైపుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. 

ఈ క్రమంలో సాగర్ రింగ్‌రోడ్డు సమీపంలోని అలేఖ్య టవర్స్ వైపు నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్(AP 07 W3459) రోడ్డు దాటుతున్న అంజమ్మను వెనుక వైపు నుంచి బలంగా డీకొట్టింది. దీంతో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురికి ఎలాంటి గాయాలు కాలేదు. పాల ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పిటల్ కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.